SKLM: ఎల్.ఎన్.పేట మండలంలో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందజేస్తున్నట్లు ఎంపీడీవో పైడి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఓటు కోల్పోకుండా ఈ ఏర్పాటు చేశామన్నారు. అర్హులు గుర్తింపు పత్రాలతో వచ్చి బ్యాలెట్ తీసుకోవాలని కోరారు. నిబంధనల ప్రకారం సకాలంలో ఓటు వేసి అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు


