హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రాష్ట్ర స్థాయి పోటీలకు జట్ల ఎంపికలు

శ్రీకాకుళం కోడిరామ్మూర్తి మైదానంలో ఈ నెల 27న రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలకు జట్ల ఎంపికలు జరుగునని జిల్లా ఎసీఎఫ్ కార్యదర్శి సీహెచ్ జగదీశ్ తెలిపారు. కబడ్డీ అండర్-14, బీచ్ వాలీబాల్ 14, 17, 19, బేస్బాల్ 14, 17 విభాగాల్లో జట్లను ఎంపిక చేయనున్నారన్నారు. క్రీడాకారులు, వ్యాయామోపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. సమాచారానికి 9440257020కు సంప్రదించాలన్నారు.