హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం

KDP: జిల్లాలో ఇవాళ జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.