మల్లేపల్లి శివారులోని మద్యం, టైర్ల పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య వ్యర్థాలు స్థానిక ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సుమారు 40 పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కాలువలు, వాగుల ద్వారా మల్లేపల్లి చెరువులోకి చేరుతున్నాయి. అధికారులు పరిశ్రమలపై తనిఖీలు నిర్వహించి, వ్యర్థ జలాలు చెరువులు, వాగుల్లోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
ఫ్యాక్టరీ వ్యర్థాలతో చెరువులు కాలుష్యమయం


