హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

ఉమ్మడి జిల్లా: మహబూబాబాద్ పట్టణంలో గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం ఓ విద్యార్థిని కళాశాల ఆవరణలోనే ప్రసవించింది. పుట్టిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందింది. తోటి విద్యార్థినులు గుర్తించి అధ్యాపకులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.