హైదరాబాద్: 28°C
భక్తి

ఈనెల 29న తిరుమలలో కార్తిక వనభోజనం

AP: కార్తీకమాసం సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవం ఈనెల 29న తిరుమలలో జరగనుంది. ఆ రోజు ప్రధాన ఆలయం నుంచి మలయప్పస్వామి గజవాహనంపై ఊరేగింపుగా పార్వేట మండపానికి వెళ్తారు. అక్కడ అర్చకులు స్నపనతిరుమంజనం నిర్వహించిన అనంతరం టీటీడీ వనభోజన కార్యక్రమాన్ని జరపనుంది. ఈ వేడుకల దృష్ట్యా ఆ రోజున ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.