హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 32 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న 59,413 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,015 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలెన్లలో భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.