హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే   

రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావచ్చని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (బాలచంద్ర) జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెళగావిని రాజధానిగా చేయాలన్న దివంగత మాజీ మంత్రి ఉమేశ్ కత్తి ఆలోచన తనకూ మంచిదనిపించిందన్నారు. సువర్ణ విధాన సౌధ నిర్మించినా ఆశించిన అభివృద్ధి జరగలేదని, డిసెంబర్ 2న బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.