హైదరాబాద్: 28°C
వార్తలు

చట్టాలను పాటిస్తున్నాం: మెటా

పార్టీ పోస్టులు, ఖాతాల నియంత్రణపై ఆందోళనల నేపథ్యంలో మెటా పాలసీ బృందం కాంగ్రెస్ నేతలతో సమావేశమైంది. తాము భారత చట్టాలను పాటిస్తూ పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని మెటా స్పష్టం చేసింది. ఈ భేటీలో రాహుల్ గాంధీని ప్రస్తావించే పోస్టులను నియంత్రిస్తున్నారంటూ కాంగ్రెస్ బృందం ఆధారాలు సమర్పించి, సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.