హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చర్చిలో అట్టహాసంగా సాంస్కృతిక వేడుకలు

MDK: మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగిపోతున్న చర్చి ప్రాంగణంలో చిన్నారులు, యువతీయువకులు ప్రదర్శించిన నృత్యాలు, క్రిస్మస్ గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.