ప్రకాశం: పామూరు పట్టణంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ముఖ్యంగా స్థానిక కొండ పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, అయ్యప్ప స్వామి దేవస్థానం వీధి, విరాట్ నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులపై అడుగు మేరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పామూరులో భారీ వర్షం.. రోడ్లు జలమయం


