కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల భద్రత కోసం కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కే.ఆర్బిట్ యాప్‌ను అమలాపురంలో ప్రారంభించారు. జిల్లాలోని 1,734 పోలింగ్ కేంద్రాలు, 104 పోలీసు వాహనాలను యాప్‌తో అనుసంధానం చేశారు. లైవ్ జీపీఎస్ ట్రాకింగ్, వీడియో స్ట్రీమింగ్, ఎస్‌ఓఎస్ అలర్ట్, వాయిస్ కమ్యూనికేషన్ సదుపాయాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బందోబస్తుకు యాప్ ప్రారంభం


