హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ 30వ వార్డు పిల్లా అప్పయ్య సందులో నివసిస్తున్న క్యాన్సర్‌ బాధితుడు కదిరి పెంటయ్యను బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.