AKP: నక్కపల్లి మండలం కాగితలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నలుగురు నిందితులను నక్కపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మురళి తెలిపారు. ఈ నెల 17న జరిగిన ఘటనకు సంబంధించి నిందితుల నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, పల్సర్, డ్యూక్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఒకరిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చైన్ స్నాచింగ్ కేసులో నలుగురు అరెస్ట్


