హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ సామగ్రి పంపిణీ

W.G: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుండటంతో నరసాపురం మండలంలో బుధవారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేశారు. మునిసిపల్ ఆడిటోరియంలో 13 కౌంటర్ల ద్వారా ఎంపీడీవో నసీర్ రెడ్డి పర్యవేక్షణలో పంపిణీ సాగింది. మండలంలోని 28 గ్రామాల్లో 62,921 మంది ఓటర్లున్నారు. 2 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 26 చోట్ల పోలింగ్ జరగనుంది. 800 మంది సిబ్బందికి 25 బస్సులు ఏర్పాటు చేశారు.