హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన మేయర్‌కు కమిషనర్ అభినందనలు

కడప నగర పాలక సంస్థ నూతన మేయర్ మట్లి సువర్ణను అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్క అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మన్సూర్ అలీఖాన్, టీడీపీ నాయకుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎంహెచ్‌ఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొని నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.