సత్యసాయి: నల్లమాడ మండలం రెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున బొగ్గన్నగారి సుధారాణి, వైసీపీ తరఫున మేకల శ్రీలక్ష్మి పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వదినామరదళ్లు వేర్వేరు పార్టీల తరఫున తలపడుతుండటంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్ పీఠం ఎవరికి దక్కుతుందోనని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెడ్డిపల్లి సర్పంచ్ బరిలో వదినామరదళ్లు


