కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి భీమవరం వాస్తవ్యులు బొడసింగ్ రామారావు, లక్ష్మీ వారి కుటుంబ సభ్యులు రూ. 55 వేలు విలువ గల 266గ్రాముల వెండి శఠగోపం విరాళంగా సమర్పించారు. ముందుగా వారు స్వామివారిని దర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దాతలకు స్వామివారి చిత్రపటం అందజేశారు
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి వెంకన్నకు వెండి శఠగోపం బహుకరణ


