హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే పోలింగ్.. సర్వం సిద్ధం: కలెక్టర్

తూ.గో జిల్లాలో రేపు నిర్వహించనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎన్నికల విధుల కోసం మొత్తం 2,688 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. వీరిలో 847 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,841 మంది ఇతర పోలింగ్ అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. రిజర్వ్ సిబ్బందితో కలిపి 20 శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.