హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎస్‌పురం పంచాయతీ ఏకగ్రీవంపై సీపీఎం అభ్యంతరం

ప్రకాశం: సీఎస్‌పురం పంచాయతీలో అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు, బెదిరింపులు, ఫోర్జరీ సంతకాలతో తమ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించారని సీపీఎం జిల్లా నాయకుడు ఊసా వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉంటూ గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.