ప్రకాశం: వై.పాలెం నియోజకవర్గంలో సర్పంచ్ నామినేషన్ల తిరస్కరణపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ అభ్యర్థులతో కలిసి మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో బుధవారం నిరసన తెలిపారు. ఎలాంటి తప్పులు లేకపోయినా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. తిరస్కరించిన నామినేషన్లను పునఃపరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆర్డీవో శివరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ల తిరస్కరణపై ఎమ్మెల్యే నిరసన


