హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ పదవికి అన్నదమ్ముల మధ్య పోటీ

AKP: కోటవురట్ల మండలం కైలాసపట్నం సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. వరుసకు అన్నదమ్ములైన సిద్దాబత్తుల నాగేశ్వరరావును వైసీపీ బలపరుస్తుండగా, సిద్దాబత్తుల పోతురాజు(బాబ్జి)కు జనసేన, టీడీపీ మద్దతు ప్రకటించాయి. గతంలో నాగేశ్వరరావు సర్పంచ్‌గా పనిచేయగా, పోతురాజు ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది.