KRNL: కల్లూరు అర్బన్‌లోని షరిన్‌నగర్, రామచంద్ర నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న శివరామాలయ ద్వార తోరణం పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గౌరు వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు శైలజ యాదవ్, దాసరి శృతి, నరసింహ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శివరామాలయ ద్వార తోరణం నిర్మాణానికి భూమిపూజ


