హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్యూటీ సెంటర్‌లో సిబ్బందికి ఇబ్బందులు

KDP: ఒంటిమిట్ట ఎన్నికల డ్యూటీ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి విధుల్లో ఉన్నా సమయానికి భోజనం అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజన ఏర్పాట్లలో నిర్లక్ష్యం, బిల్లుల్లో భారీ ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.