హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిక్లరేషన్ ఫారం అందుకున్న బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీసీ ఇందిరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుహాసిని డిక్లరేషన్ పారాన్ని బీసీ ఇందిరమ్మకు అందజేశారు. పట్టణ ఉప సర్పంచ్‌గా టంగుటూరి శీనయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వార్డు సభ్యులకు కూడా పారాలను ఇచ్చారు.