హైదరాబాద్: 28°C
క్రీడలు

పిచ్‌ను ఎక్కువగా విశ్లేషించొద్దు: హెన్రీ

భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుందనే ప్రచారాన్ని కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఖండించాడు. ఈ స్టేడియంలో ఇటీవల భారీగానే పరుగులు నమోదైనట్లు తెలిపాడు. పిచ్ ఆరంభంలో బౌలర్లకు, సమయం గడిచే కొద్దీ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాడు. పిచ్‌ను మరీ ఎక్కువగా విశ్లేషించవద్దని సూచించాడు.