UAEపై జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ ప్రశంసలు కురిపించాడు. సాధారణంగా ఈ వయసు పిల్లలు హోంవర్క్ గురించి ఆలోచిస్తుంటే, వైభవ్ ప్రత్యర్థులకు పీడకల మిగిల్చాడని అన్నాడు. తదుపరి సచిన్, విరాట్ ఎవరనే ప్రశ్నల తీరును వైభవ్ మార్చేశాడని, అతడిని చూసి యువ ఆటగాళ్లు జట్టులోకి రావాలని ఆశిస్తారని పేర్కొన్నాడు.
క్రీడలు
వైభవ్ ప్రత్యర్థులకు పీడకల మిగిల్చాడు: అతుల్ వాసన్


