హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ

చిత్తూరు జిల్లాలో గ్రామ సర్పంచ్ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్. షాను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్‌తో కలిసి పెద్దతాండా, కెంచనబల్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.