హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ నేతల డప్పు ప్రచారం

KNR: అలుగునూరులో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. బుధవారం చొప్పదండి చౌరస్తాలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్థానిక నాయకులతో కలిసి స్వయంగా డప్పు కొడుతూ చాటింపు వేశారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.