టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ IPL-2027 వేలంలోకి అడుగుపెట్టాడు. రూ.30 లక్షల కనీస ధరతో ఐపీఎల్ వేలం రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇటీవల ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో ఆర్యవీర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ వేలానికి దూరంగా ఉన్నాడు.
క్రీడలు
IPL-2027 వేలానికి సెహ్వాగ్ కుమారుడు


