హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు కార్లు ఢీ.. ఒకరికి గాయాలు

MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో బుధవారం వెనుక నుంచి వచ్చిన కారు ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.