MDCL: జగద్గిరిగుట్ట పరిధిలోని దేవమ్మ బస్తీ, పాపిరెడ్డి నగర్ ఏ-బ్లాక్‌లలో నిర్మించిన గణేష్ మండపం సింహద్వారాలను (కమాన్లు) బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. సింహద్వారాలు మన ఆచార సంప్రదాయాలు, వారసత్వ వైభవానికి ప్రతీకలని ఆయన అన్నారు. మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, ఆలయ మాజీ ఛైర్మన్ వేణు పాల్గొన్నారు.
తెలంగాణ
సింహద్వారాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలు: ఎమ్మెల్యే


