హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

హైదరాబాద్‌‌లోని అంబర్‌‌పేట శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు చేపట్టనున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్రకు ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించారు.