హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేటలో జోరుగా ఎన్నికల ప్రచారం

BPT: చీరాల కొత్తపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చుండూరు వాసు, వార్డు మెంబర్ అభ్యర్థి ఎనుముల రాజు గెలుపు కోసం ప్రచారం జోరుగా సాగింది. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ప్రచారంలో పాల్గొని ఇరువురికి సంపూర్ణ మద్దతు తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల అభివృద్ధికి, ప్రతి ఒక్కరి సంక్షేమానికి వీరికి ఓటేయాలని ప్రజలను కోరారు.