హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువైద్య కళాశాలలో పిండ మార్పిడి కార్యక్రమం

RR: రాజేంద్రనగర్ లోని పీ.వీ.నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ పశువైద్య కళాశాలలో పిండ మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. హోల్ స్టీన్ ఫ్రీసియన్ × సాహివాల్ సంకర జాతికి చెందిన 13 పిండాలను సాహివాల్, దేవని, ఒంగోలు జాతుల గ్రహీత ఆవులకు బదిలీ చేశారు. ఈ సాంకేతికత ద్వారా ఉత్తమ జన్యు లక్షణాలున్న ఆవుల నుంచి తక్కువ సమయంలో ఎక్కువ సంతతిని పొందవచ్చని పేర్కొన్నారు.