హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ASR: రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన మర్రి బుల్లయ్య (52) ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందారు. బజాజ్ ప్లాటినా వాహనంపై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన ఆయనను జడ్డంగి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.