హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగుపామును చాకచక్యంగా పట్టిన స్నేక్ క్యాచర్

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని MD.కాసిం బస్తీలో నాగుపాము సంచారం కలకలం రేపింది. బుధవారం స్థానిక నివాసంలో నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించగా, ఆయన అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అడవిలో సురక్షితంగా వదిలివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.