KMM: చింతకాని మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల కిసాన్ మోర్చా నాయకులు బుధవారం తహశీల్దార్ కరుణశ్రీకి వినతిపత్రం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణమే చొరవ చూపి మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కరవు పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
కరవు మండలంగా ప్రకటించాలని BJP వినతి


