హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

GNTR: తెనాలిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి తెలిపారు. బుర్రిపాలెం ఏకగ్రీవమైందని, మిగిలిన చోట్ల ఎన్నికలు జరుగుతాయని, పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు, సమస్యల పరిష్కారంపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.