హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

45 వేల చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు

ATP: సత్యసాయి బాబా 101వ జయంతి సందర్భంగా సత్యసాయి సంజీవని ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. 45 వేల మంది చిన్నారులకు ఉచితంగా విజయవంతమైన గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. రాయ్‌పూర్ ఎంపీ బ్రిజ్‌మోహన్ అగర్వాల్ సమక్షంలో సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి. శ్రీనివాస్‌కు ధృవపత్రాన్ని అందజేశారు.