హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో ఫ్లై ఓవర్.. పొంచి ఉన్న ప్రమాదం

PDPL: పాలకుర్తి మండలం బసంతనగర్‌లోని ఆల్ట్రాటెక్ కంపెనీ ఫ్లై ఓవర్ అధ్వానంగా మారి వాహనదారులకు ముప్పుగా మారింది. ఇరుకైన వంతెనపై రెండు వాటర్ పైపులు పైనుంచి వేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత వంతెనకు పెచ్చులూడి శిథిలావస్థకు చేరడంతో ప్రమాద భయం నెలకొంది. వెంటనే మరమ్మతులు చేపట్టి పైపులను భూగర్భంలోకి మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.