హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడూరులో ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: DSP

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలో పంచాయతీ ఎన్నికలను పటిష్ఠ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నట్లు DSP నీలయ్య తెలిపారు. ఎన్నికల విధుల కోసం 170 మంది పోలీసు సిబ్బందిని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఓటర్లు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద, రోడ్లపై గుంపులుగా చేరితే చర్యలు తీసుకుంటామన్నారు.