హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాస్ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

తిరుపతి రూరల్ మండలం మంగళంలోని రాస్ వృద్ధాశ్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉష, శ్రీధర్ మూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఎస్ ముజాకర్ ఆప్తాల్మాలజీ, జనరల్ మెడిసిన్ వ్యాధులకు సంబంధించి 100 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు సరఫరా చేశారు.