HYD: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలోని అంబర్పేటలో ప్రారంభమైన నషా ముక్త్ భారత్ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. యువత మంచి అలవాట్లతో ఈ దేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే అవకాశాన్ని తీసుకోవాలన్నారు. నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'యువత దీనిని ఉద్యమంగా తీసుకోవాలి'


