ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 135 పంచాయతీలు ఉండగా, 49 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 86 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం మొత్తం 258 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
రేపే పల్లె పోరు..!


