హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్డీవో కార్యాలయం ముందు విద్యార్థుల ధర్నా

VKB: విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ ఫీజుల కారణంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు చదువు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.