KRNL: ఆదోని మున్సిపాలిటీలో ఈఈగా పనిచేస్తున్న అధికారి వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఖాళీ కానున్న ఈఈ పోస్టుపై మరో అధికారి కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబరులో జరిగే ప్రమోషన్లలో అవకాశం రాకపోవచ్చనే అంచనాతో ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నాయకుల చుట్టూ తిరుగుతూ లాబీయింగ్ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఈఈ కుర్చీపై అధికారుల కన్ను!


