హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ దినోత్సవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

RR: ఇబ్రహీంపట్నంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత రాజ్యాంగ దినోత్సవ సదస్సు పోస్టర్‌ను GHMC 53వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించిన సందర్భంగా రూపకర్తలకు నివాళులర్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.