హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదాన భవనం కోసం దాతల విరాళం రూ 1,00,011

ప.గో: కాళ్ల మండలం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నదాన భవనం అభివృద్ధి కోసం రూ 1,00,011 విరాళం అందించినట్టు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు బుధవారం తెలిపారు. ఐ భీమవరంకు చెందిన కనుమూరి సూర్యనారాయణ రాజు (ఐ భీమవరం సూరి బాబు) నాగపద్మ జ్యోతి దంపతులు అందజేసినట్టు ఆయన తెలిపారు. దాతలకు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు.