బీహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో దారుణం చోటుచేసుకుంది. ఆరుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చి పెళ్లికి వచ్చిన అతిథులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది.
వార్తలు
పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!


